2025 Presidents Message

2025 Presidents Message

 My alt text

శ్రీకృష్ణ మతుకుమల్లి

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు !

2025వ సంవత్సరానికి చికాగో ఆంధ్ర సంఘం అధ్యక్ష బాధ్యతలకు నన్ను ఎంచుకున్న సంస్థ సభ్యులకు,  కార్యవర్గ బృందానికి మరియూ ధర్మకర్తలకు ధన్యవాదములు. నాతో పాటు ఈ సంవత్సర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వారందరికీ శుభాభినందనలు. ఆవిర్భావం నుంచి సంస్థ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తూ ముందుకు నడిపించిన పూర్వ అధ్యక్షులు మరియూ వారి కార్యవర్గ బృందానికి నా కృతజ్ఞతలు.

ఈ సంస్థ స్థాపించిన నాటినుండి, వివిధ విభాగాలలో పనిచేసిన అనుభవంతో సంస్థ యొక్క స్థాపక ఉద్దేశాలు, అమలు విధానాలు తెలిసిన వాడిగా,  మీ అందరి సహకారంతో  సంస్థను మరింత మందికి చేరువ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్లే విధంగా వ్యవహరిస్తాను.

నేను, నా కార్యవర్గ బృందం ఈ సంవత్సరం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు , మరియు అందరికీ ఉపయుక్తమయే వైవిధ్యభరితమైన కార్యక్రమాల శ్రేణిని రూపొందించాము. తమ తమ వృత్తి ఉద్యోగాలను మరియు జీవన ప్రమాణాలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్న మన ప్రవాసాంధ్రులలో తెలుగు  భాష వాడుకను మరియు సంస్కృతీ సంప్రదాయాలను విస్తరింపజేసేందుకు కృషి చేస్తామని మనవి చేస్తున్నాను. అవసర సమయంలో ఒకరికొకరు మద్దతునిస్తూ, మన విజయాలను సంబరాలు చేసుకుంటూ కలిసి నిలబడదాం. మీ ప్రోత్సాహం మరియు సహకారంతో మనం మరెన్నో గొప్ప విజయాలను సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మూలాలతో ఈ దేశంలో  ఉన్న వారిలో పరస్పర సహకారం, ఐక్యతను పెంపొందించడంతెలుగు భాష వాడుక, సంస్కృతి  ప్రోత్సహించడం కోసం నిరంతర కృషి చేస్తాను.

అలాగే చికాగో ఆంధ్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతదేశంలోనూ మరియు అమెరికాలోనూ మహిళా సాధికారత, విద్య, గ్రామీణాభివృద్ధి, వైద్య రంగాలలో చేస్తున్న అనేకానేక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి మీ సహకారం అర్థిస్తున్నాను.

సంస్థలో కార్యక్రమాల అమలులో మా ప్రాయోజిక కర్తలు  కీలక పాత్ర పోషిస్తారు. ఇతర సంవత్సరాల మాదిరిగానే వారి మద్దతును కొనసాగించమని,  మా సంస్థ కార్యక్రమలలో భాగస్వాములుగా వుండాలని అభ్యర్థిస్తున్నాను.

ఈ ప్రయాణంలో మీ ఆలోచనలు సలహాలు సూచనలు   వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేరుగా సంప్రదించడానికి నేను మీకెప్పుడూ అందుబాటులో ఉంటాను. మీ అభిప్రాయాలు సద్విమర్శలు  మా సమిష్టి ప్రయత్నాలకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశంగా నిలుస్తాయి.

భవదీయుడు

శ్రీకృష్ణ మతుకుమల్లి అధ్యక్షులు - ౨౦౨౫

చికాగో ఆంధ్ర సంఘం

 -------------------------------------------------------------------------------------------

 

Happy New Year to everyone!

I would like to extend my gratitude to the members of the Chicago Andhra Association, the board members, and the trustees for selecting me for the responsibilities of the president for the year 2025. Congratulations to all those who have been elected as Board of Directors along with me this year. My gratitude goes to the former presidents, their executive committees and board members who have worked tirelessly for the development of the organization since its inception.

From the very day this organization was founded, I am involved and have gathered experience working in various departments, making me well-versed with the organization's founding objectives and implementation of various programs. With all your support, I will strive to bring the organization closer to more people and lead it forward.

My executive team and I have planned numerous cultural programs, sports events, and a variety of other activities that will be beneficial to everyone this year. I appeal to all Andhra community members, who have elevated their professional careers and living standards, to continue promoting the usage of the Telugu language and our cultural traditions. Let's support each other in times of need, celebrate our successes together, and stand united. I believe that with your encouragement and cooperation, we can achieve even greater successes. We will tirelessly work to enhance mutual support, unity among those with roots Telugu in this country, and to promote the use of the Telugu language and culture.

Additionally, I seek your support in further expanding the numerous service activities under the Chicago Andhra Foundation in both India and the United States. These activities include women's empowerment, education, rural development, and the medical field.

In the implementation of the organization's programs, our sponsors play a crucial role. I request them to continue their support as in previous years and to participate in our organization's activities.

I am ready to listen to your thoughts, advice, and suggestions on this journey. I am always available for you to contact directly. Your opinions and constructive criticism will always serve as a guiding light for our collective efforts.

Kind regards,

Srikrishna Matukumalli – President 2025

Chicago Andhra Association

Subscribe

Stay informed on our latest news!

Media Partners

CAF Projects

CHICAGO ANDHRA ASSOCIATION CHICAGO ANDHRA ASSOCIATION